లాక్‌డౌన్ వేళ పేదల కడుపు నింపుతున్న జీహెచ్‌ఎంసీ

లాక్‌డౌన్ వేళ వలస కూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేక కొంత మంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి జీహెచ్‌ఎంసీ కడుపునిండా భోజనం పెడుతోంది. ఇందుకోసం నగరంలోని పలు ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ సూచనతో, మేయర్ బొంతు రామ్మోహన్ చొరవతో పేదలు కడుపు నిండా తింటున్నారు. ఇంతకుముందు రూ.5కు అందించిన ఆహారాన్ని ఇప్పుడు పూర్తి ఉచితంగా పెడుతుండటం గమనార్హం. దిల్‌సుఖ్‌నగరల్ ఏర్పాటు చేసిన అలాంటి ఓ కేంద్రాన్ని వీడియోలో చూడవచ్చు.