బెంగళూరు రహదారి వెంట షాద్‌నగర్ వద్ద రోడ్డు పక్కన పెద్ద ఎత్తున దోసకాయల బస్తాలు దర్శనమిచ్చాయి. అది గమనించిన స్థానికులు గబగబా.. అందినకాడికీ తీసుకొని అక్కడ నుంచి ఉడాయించారు. ఆ దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి. ఇంతకీ రహదారి పక్కన ఆ దోసకాలయు ఎక్కడివంటే.. ఇటీవల కర్ణాటకలోని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు దోసకాయల లోడుతో డీసీఎం వాహనం ఒకటి వచ్చింది. కొనేవాళ్లు లేకపోవడంతో వచ్చిన మార్గంలోనే తిరుగుముఖం పట్టారు.
పోతూ, పోతూ ఆ దోసకాయలను ఏం చేయాలో అర్థం కాక రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ బైపాస్ రహదారిపై పారబోసి వెళ్లారు. దీంతో జనాలు ఇదే మంచి అవకాశంగా రోడ్డు వెంట కుప్పలు తెప్పలుగా పడిపోయిన దోసకాయను దొరికిన కాడికి తీసుకెళ్లారు. అసలే లాక్‌డౌన్.. చక్కగా పచ్చడి పెట్టుకుంటే రెండు నెలు వస్తుందిగా..!