వైఎస్సార్‌సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి కేంద్రంలో కీలక పదవి దక్కింది. పార్లమెంట్‌లో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నియామకం జరిగింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి పీఏసీ చైర్ పర్సన్‌గా ఉన్నారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ప్రకటించింది. ఇటు రాజ్యసభ నుంచి ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు స్థానం దక్కింది.
వైసీపీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి.. టీడీపీ ఎంపీకి కూడా!