ఇకపై ఇంటర్‌ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం...ఏపీ సర్కార్‌ నిర్ణయం..!

1.కనీస ఉద్యోగార్హత ఇంటర్‌:
గత దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే కనీస అర్హత 10వ తరగతి ఉత్తీర్ణతగా ఉండేది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస అర్హత ఇంటర్మీడియెట్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.


2. అకడమిక్‌ క్యాలెండర్‌లోనూ మార్పులు:
కరోనావైరస్ అన్నీ రంగాలను కుదిపేసింది. వీటిలో విద్యారంగం కూడా ఉంది. ముఖ్యంగా పిల్లల చదువులకు ఈ మహమ్మారి బ్రేక్ వేసింది. విద్యాసంవత్సరం అర్థాంతరంగా ముగిసింది. 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. తాజాగా ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను మార్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజాగా విద్యాసంవత్సరంకు సంబంధించిన క్యాలెండర్‌లో మార్పులు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఒక ఏడాది జూన్ 12 నుంచి దాని తర్వాత ఏడాది జూన్ 11వరకు ఒక విద్యాసంవత్సరం ఉండేది. అయితే కరోనా వైరస్ కారణంగా విద్యాసంవత్సరంలో మార్పులు చేసింది ప్రభుత్వం.